Read Time:4 Minute, 34 Second
సుభాష్ చంద్రబోస్ (1897-1945)
- Subhas Chandra Bose జననం – కటక్ (జనవరి 23)
- జాతిత్వం (Ethnicity)- బెంగాళీ
- తల్లిదండ్రులు – ప్రభావతీదేవి, జానకీనాథ్ బోస్
- భార్య – ఎమిలీ షెంకిల్ (1937లో వివాహం)
- చదివిన యూనివర్సిటీలు – 1) కలకత్తా యూనివర్సిటీ
2) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ - బిరుదులు : నేతాజీ (Respected leader) -1928 మద్రాస్ సమావేశంలో ఇవ్వబడింది.
- ప్రభావితం చేసిన వ్యక్తుల బోధనలు వివేకానంద, అరబిందో
- రాజకీయ గురువు – సి.ఆర్. దాస్
- వ్రాసిన గ్రంథం – Indian Freedom struggle (అనారోగ్యంతో స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు రాయగా, లండన్‌లో 1935లో ప్రచురింపబడినది)
- సంపాదకునిగా పనిచేసిన పత్రిక -ఫార్వర్డ్ (సి.ఆర్.దాస్ ది )
- ఏర్పాటు చేసిన సంస్థలు – 1) Independance for India League -దీనిని 1928లో కలకత్తా కేంద్రంగా నెహ్రూ, శ్రీనివాస అయ్యంగార్లతో కలిసి ఏర్పాటు చేశాడు.
2) Congress Democratic Party (1930)
3) Free Indian League
4) Forward bloc - అధ్యక్షునిగా పనిచేసిన INC సమావేశాలు – 1) 1938, హరిపుర
2) 1939,త్రిపురి - INC లో ప్రవేశించినది – 1921 (గాంధీజీ పిలుపు మేరకు ICS కు 1920లో రాజీనామా చేసి)
- 1921లో లండన్ నుంచి భారత్‌కు వచ్చిన తరువాత సి.ఆర్.దాస్ నేతాజీకి మూడు బాధ్యతలుఅప్పగించారు. 1. కలకత్తాలోగల నేషనల్ కాలేజీలో టీచింగ్ బాధ్యతలు
2. స్వరాజ్ అనే పత్రిక (ఇంగ్లీష్) కు సంబంధించిన జర్నలిజం బాధ్యతలు
3. కాంగ్రెస్ సంస్థపైన పరిశోధన నిర్వహించడం. - స్వరాజ్య పార్టీ తరఫున 1924లో కలకత్తా ప్రధాన కార్యనిర్వాహణాధికారిగా పనిచేశాడు.
సుభాష్ చంద్రబోస్ నినాదాలు: 1) చలో ఢిల్లీ 2) జై హింద్ (Glory to India) 3) నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.
(Give me blood and i will give you freedom) (1943 సింగపూర్ లో )
4) Unity, Agreement, Sacrifice
- 1931లో నేతాజీ AITUC కి అధ్యక్షుడయ్యాడు. అదే విధంగా టిస్కోకు కూడా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.
- జైల్లో ఉండగానే కలకత్తా మేయర్ అయ్యారు (1930).
- ఇతను 1938లో జాతీయ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశాడు.
జపాన్ పర్యటన
- నేతాజీ కలకత్తాలోని హర్వేల్ శిలా విగ్రహాలను తొలగించాలని చేసిన ఉద్యమంలో భాగంగా విధించిన గృహ నిర్బంధం నుంచి ‘మౌళ్వీ జియావుద్దీన్’ అనే పఠాన్ వేషంతో కలకత్తా నుంచి ఢిల్లీకి తప్పించుకున్నాడు.
- ఫ్రాంటియర్ వెయిల్ అనే రైలులో ఢిల్లీ నుంచి పెషావర్, అక్కడి నుండి కాబూల్ చేరాడు.
- కాబూల్‌లో మజుట్టా పేరుతో నకిలీ పాస్‌పోర్టు ఇచ్చి బోస్ జపాన్‌కు వెళ్లడానికి సహాయపడిన వ్యక్తి – ఉతమ్చంద్
- జపాన్‌లో బోసు రాసిన రాస్ బిహారి బోస్ ఆహ్వానం పలికిన తరువాత జర్మనీ చేరి 1942 మే 27న హిట్లర్‌ను కలవడంతో పాటు అతని అనుచరుడైన రిబేన్ట్రేప్ తో స్వాతంత్య్రం గురించి, అక్ష రాజ్యాల (Axis Powers) సహకారం గురించి చర్చించాడు.
- బెర్లిన్ రేడియో నుండి ప్రసంగించాడు.
- సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose ) సింగపూర్ నుండి టోక్యో వెళుతూ ఫార్మోజాలోని తైవాన్ వద్ద 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు.
- ఇతను సైగాన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆగస్టు 17న ఎక్కిన విమానం – మిట్సుబిషి ki-21
- ఆగస్టు 22న ‘రేడియో టోక్యో ‘మరణవార్త’ను ప్రకటించినది.
- సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose ) మరణంపై విచారణ జరిపిన కమిటీలు -1. షానావాజ్ కమిటీ 2 : ఖోస్లా కమిటీ 3. జస్టిస్ ముఖర్జీ కమిటీ
Average Rating