Read Time:5 Minute, 41 Second
CLIMATE OF ANDHRAPRADESH – 3
అరేబియా శాఖ :
- ఈ శాఖ హిందూ మహాసముద్రం, (CLIMATE OF ANDHRAPRADESH – 3)అరేబియా సముద్రం నుంచి తేమను సేకరించి మొదటగా జూన్ ఒకటో తారికు నాటికీ కేరళ తీరాన్ని తాకి , అక్కడనుంచి వర్షాన్నిచుకుంటూ జూన్5 నాటికి కర్ణాటక చేరుకుని, జూన్ 7వతారీకు లేదా జూన్ రెండవ వారానికి ఆంధ్రప్రదేశ్ చైరుకుంటాయి.మరియు జూన్ చివరి వాటికి రాష్ట్రమంతా విస్తరిస్తాయి.
- పశ్చిమ కనుమలనుఢీ కొని పైకిలేచి వర్షన్నిచ్చిన ఋతుపవనాలు అక్కడినుంచి క్రిందకు దిగుతూ ప్రయాణించి తూర్పుకనుమాలను ఢీ కొని తీరప్రాంతం లో వర్షపాతాన్నీ ఇస్తాయి .
- కాని పశ్చిమ కనుమల పవనపరాన్ముఖ ప్రాంతంలో ఉన్న రాయల సీమ ప్రాంతంలో ఉన్న తక్కువ వర్షపాతం సంభవిస్తుంది.
- రాయలసీమలో వర్గాలు సరిగాలేక అర్ధశుష్క మండలాలు ఏర్పడ్డాయి. జూన్ మధ్య నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు వర్షాకాలం ఉంటుంది .
- నైరుతి రుతు పవనాలు వల్లఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రాంతం లో 800 మీ.మీ. వర్షపాతం దక్షిణ ప్రాంతం లో 400 మీ.మీ. వర్షపాతం ఉంటుంది.(CLIMATE OF ANDHRAPRADESH – 3)
- ప్రాంతాల వారీగా చూస్తే కోస్త తీరం సగటు 651 మీ.మీ.. రాయలసీమలో 463మీ.మీ వర్షపాతం నమోదవుతుంది.
- నైరుతి ఋతుపవనాల పల్ల రాష్ట్రం లో ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు కు వెళ్ళే కొలది వర్షపాతం తగ్గుతుంది.
- ఆంధ్రప్రదేశ్ సగటు సంవత్సరిక వర్షపాతం 962 .8 మీ మీ కాగా 2022 లో నైరుతి రుతుపవనాల కాలంలో 583 .2 మీ.మీ. ఈశాన్య ఋఋతుపవనాల కాలంలో368 మీ మీ వర్షపాతంసంభవిస్తుంది.
- వర్షాల ప్రారంభంలో మబ్బులు, వర్షం వల్ల పగటి ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది .కానీ వర్షం లేని రోజుల్లో సూర్యరశ్మి కారణంగా వేడి గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా చెమట పడుతుంది .
- 2022లో ఆంధ్రప్రదేశ్ లో నైరుతి ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా: అల్లూరి సీతారామరాజు (986 మీ. మీ.) కోనసీమ జిల్లా( 888 మీ. మీ.)
- 2022లో ఆంధ్రప్రదేశ్ నైరుతి ఋతుపవన కాలంలో అత్యల్ప వర్షపాతం పొందే జిల్లా: ప్రకాశం (319 మీ.మీ.) నెల్లూరు (336 మీ. మీ.)
ఈశాన్య రుతుపవన కాలం/ తిరోగమన నైరుతి రుతుపవనకాలం
- సెప్టెంబర్ అంతానికి ఉత్తర భారతదేశం, టిబెట్ లలో ఉన్న అల్పపీడన ప్రాంతం అధిక పీడన ప్రాంతంగా మారుతుంది.
- ఇదే సమయంలో భూమధ్యరేఖ వద్ద అల్పపీడనం ఉంటుంది.
- వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ (Westerly Jet Streems) హిమాలయ దక్షిణ ప్రాంతంలో అధిక పీడనాన్ని సృష్టిస్తాయి.
- దీని కారణంగా పవనాలు ఉత్తర భారతదేశం టిబెట్ ల నుంచి భూ మధ్య రేఖ వైపు పయనిస్తాయి.
- వీటిని ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అంటారు.
- ఈ కాలాన్ని ఉత్తర వర్షాకాలం అంటారు. ఉత్తర ప్రాంతాల కంటే దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది.
- ఈ ఋతుపవనాల వల్ల ప్రధానంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో అధిక వర్షాలు కురుస్తాయి.
- అక్టోబర్లో భారతదేశంలో ఏర్పడిన వేడిని ‘అక్టోబర్ హీట్’ అంటారు.
- ఈశాన్య ఋతుపవనాల కాలంలో బంగాళా ఖాతంలో అనేక అల్ప పీడనాలు ఏర్పడతాయి.
- ఈ అల్పపీడనాలు తుఫానులుగా మారి ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరమునకు ముఖ్యంగా దక్షిణ తీరానికి వర్షాలను ఇస్తాయి.
- దీనివలన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈశాన్య ఋతుపవనాల కాలంలో 368 మీ. మీ. వర్షపాతంసంభవిస్తుంది.
- ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లాలు: నెల్లూరు (731మీ.మీ), తిరుపతి, చిత్తూరు, ప్రకాశం.
- ఈశాన్య ఋతుపవనకాలంలో అత్యల్ప వర్షపాతం పొందే జిల్లాలు: కర్నూలు(164మీ.మీ),అనంతపురం(181మీ. మీ)(CLIMATE OF ANDHRAPRADESH – 3)
- అక్టోబరు వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య వారధిలా ఉండి సంధిమాసంలా ఉంటుందని చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది.
- దీన్ని సాధారణంగా అక్టోబరు వేడిమి (October Heat) అని అంటారు. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం368 మి.మీ. నమోదు అవుతుంది.
CLIMATE OF ANDRA PRADESH – 2
Average Rating