RIVER SYSTEM OF AP -1

0 0
Read Time:8 Minute, 48 Second

ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ

RIVER SYSTEM OF ANDRA PRADESH

  • ఆంధ్ర ప్రదేశ్ ను నదుల రాష్ట్రం గా చెప్పవచ్చు. అన్ని జిల్లాలలో నదులు ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 40 నదులు ప్రవహిస్తున్నాయి.
  • వీటిలో 15 అంతర్ రాష్ట్ర నదులు ఉన్నాయి.
  • రాష్ట్ర భూభాగం వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశగా వాలి ఉండటం వలన రాష్ట్రంలో ప్రవహించే నదులు అన్నీ సాధారణంగా వాయువ్య దిశ నుంచి ఆగ్నేయం వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
  • మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న ప్రధాన నదులు: గోదావరి ,కృష్ణ నది, పెన్నా నది.(RIVER SYSTEM OF AP )
  • పశ్చిమ కనుమలలో జన్మించే నదులు: గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర.
  • తూర్పు కనుమలలో జన్మించే నదులు: వంశధార, నాగావళి, మాచ్ ఖండ్.
  • పశ్చిమ కనుమలలో జన్మించే నదులు చాలా పొడవుగా అత్యధిక నీటి ప్రవాహం కలిగి ఉంటాయి.
  • తూర్పు కనుమలో జన్మించే తక్కువ పొడవును కలిగి నీటి ప్రవాహం తక్కువగా కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవహించే నదులు అన్నీ వర్షాధారమైనవి, జీవనదులు కావు.
  • ప్రపంచ నీటి దినోత్సవం : మార్చి 22 
  • నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం: పొటమాలజి
  • ప్రపంచ నదుల దినోత్సవం :సెప్టెంబర్ చివరి ఆదివారం
  • ప్రపంచ నీటి దినోత్సవ థీమ్ లు :2018 – Nature for Water
                                                         2019 – Leaving No One Behind
                                                         2020 – Water and Climate Change
                                                         2021 – Valuing Water
                                                         2022 – Groundwater: making the invisible visible.
                                                         2023 – ACCELERATING CHANGE
నదీ పరీవాహక ప్రాంతం :
  • ఒక నదికి ఈ ప్రాంతాలనుంచి నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల మొత్తం వైశాల్యం ను ఆ నది యొక్క పరీవాహక ప్రాంతంగా పేర్కొంటారు.
  • పరీవాహక ప్రాంతం ఆధారంగా నదులను మూడు రకాలుగా విభజించారు. అవి :

1. ప్రధాన నదులు : 20,000 చ. కి.మీ లేదా అంతకంటే ఎక్కువ పరీవాహక ప్రాంతం ను కలిగిన నదులను ప్రధాన నదులుగా పేర్కొంటారు. ఇవి భారతదేశంలో 14 ఉన్నాయి. అవి : గంగా, సింధూ, బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి, సబర్మతి, మహీ, సువర్ణరేఖ, బ్రహ్మణి, మహానది, గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా. భారతదేశంలోని మొత్తం నదుల ద్వారా ప్రవహించే నీటిలో 85% నీరు ఈ 14 నదుల ద్వారానే ప్రవహిస్తుంది.

2. మధ్య తరహా నదులు : 2000- 20,000 చ. కి.మీ మధ్య పరీవాహక ప్రాంతంను కలిగిన నదులను మధ్య తరహానదులు గా పేర్కొన్నారు. ఇవి 44 వున్నాయి. వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం 7%.

3. చిన్న తరహా నదులు: 2000 చ.కి.మీ కంటే తక్కువ పరీవాహక ప్రాంతంను కలిగిన నదులను చిన్న తరహా నదులుగా పేర్కొన్నారు. ఇవి సుమారు 187 ఉన్నట్లుగా భారత ప్రభుత్వం గుర్తించింది. వీటి ద్వారా ప్రవహించే నీటిశాతం 8%.

గోదావరి నది:

  • ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా లోని పశ్చిమ కనుమలలోని ఖీలే సరస్సు వద్దఉన్న త్రయంబకేశ్వరంవద్ద జన్మిస్తుంది. ఇది అరేబియా సముద్రానికి 80 కి. మీ. దూరంలో జన్మిస్తుంది.
  • గోదావరినది మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
  • దీని మొత్తం పరివాహక ప్రాంతం: 3,12,812 చ.కి.మీ., గోదావరి పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రాలు 7.
  • అవి మహారాష్ట్ర (48.6%),తెలంగాణ (18.8%),మధ్య ప్రదేశ్ (10.9%), ఛత్తీస్ గడ్ (10.1), ఒడిస్సా (5.7%),ఆంధ్రప్రదేశ్(4.5%), కర్ణాటక (1.4%). గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ.
  • విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్లో గోదావరి 770 కి.మీ. ప్రయాణించేది, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 250కి. మీ. తెలంగాణలో 520 కి. మీ. ప్రయాణిస్తుంది.(RIVER SYSTEM OF AP )
  • గోదావరి నది మహారాష్ట్రలో అత్యధిక దూరం ఛత్తీస్గఢ్ అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది.
  • ఈ  నది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది.
  • గోదావరి నది మొదట బూర్గంపాడు మండలం మడిమెరు గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
  • అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్-తెలంగాణల సరిహద్దుగా కొంతదూరం ప్రయాణించి తెలంగాణలోని భద్రాచలం మండలం గోగుబాక గ్రామం వద్ద గోదావరి పూర్తిగా తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
  • గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం: కందకుర్తి(నిజామాబాద్) గోదావరి నది ఏపీలోని ధవలేశ్వరంకు దిగువన ఏడు శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది.
  • గోదావరి యొక్క ఏడు శాఖలు: గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భారద్వాజ, కౌశిక, ఆత్రేయ
         శాఖ సముద్రంలో కలిసే ప్రాంతం
      గౌతమి యానాం
      వశిష్ట అంతర్వేది
      వైనతేయ కొమరగిరి
     తుల్య బెండమూరులంక
   భరద్వాజ బెండమూరులంక
   కౌశిక ఇదిమార్గమధ్యంలో వశిష్ట కలియును
  ఆత్రేయ ఇది మార్గమధ్యంలో వైనతేయలో కలుస్తుంది

 

గోదావరి నది ఇతర పేర్లు:

  • దక్షిణ గంగ: దక్షిణ భారత్ లో గంగానదిని పోలిన నది, మరియు దక్షిణ భారత్ లో అతి పెద్ద నది కనుక దక్షిణ గంగ అని పిలుస్తారు.
  • వృద్ధ గంగ: భారత దేశం లో అతి పురాతన నది కనుక ఇలా పిలుస్తారు.
  • తెలివాహ నది: టాలెమీ తన జాగ్రఫీ గ్రంధంలో ఈ పేరుతో ప్రస్తావించాడు.
  • పోయెటిక్ రివర్– ప్రసిద్ధిగాంచిన అనేకమంది కవులు ఈనదీ పరివాహక ప్రాంతంలో జన్మించటం వలన ఈ పేరు వచ్చింది.
  • ఇండియన్ రైన్ : రైన్ అనే నది జర్మనీ పోలాండ్ స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ పర్వతాల మద్యలో ప్రవహిస్తూ నౌకాయానానికి అనువుగా ఉండి, పర్యాటకరంగం అభివృద్ధికి దోహదపడుతుంది.
  • ఈ రైన్ నదిలాగానే మన గోదావరి నదీ కూడా పాపికొండల మధ్య ప్రవహిస్తూ నౌకాయానానికి అనువుగా ఉండి, పర్యాటకరంగం అభివృద్ధికి దోహదపడుతుంది.
  • అందువలన గోదావరిని ఇండియన్ రైన్ అని పిలుస్తారు.
ఇతర ముఖ్యమైన అంశాలు:
  • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అత్యంత పొడవైన నది: గోదావరి
  • భారతదేశంలో అతిపెద్ద నది అత్యంత పొడవైన నది: గంగా నది
  • మన  దేశంలో పరివాహక ప్రాంతం ఆధారంగా మూడవ అతిపెద్ద నది: గోదావరి
  • భారతదేశంలో పొడవు ఆధారంగా రెండవ అతిపెద్ద నది: గోదావరి
  • భారతదేశంలో పరివాహక ప్రాంతం ఆధారంగా రెండవ పెద్ద నది : సింధు.
  • దక్షిణత్రివేణి సంగమం: గోదావరి నది తెలంగాణలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు నదులను కలుపుకొని త్రివేణి సంగమం ఏర్పాటు చేస్తుంది.
  • నోట్: గోదావరి నది కందకుర్తి వద్ద మంజీరా, హరిద్రా నదులను కలుపుకొని త్రివేణి సంగమం ఏర్పాటు చేయును.

CLIMATE OF ANDRA PRADESH – 1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!