Read Time:3 Minute, 52 Second
IRDAI Removes Age Limits On Health Insurance
ఐఆర్డీఏ ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఎత్తివేసింది. కనుక ఇకపై సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయస్సుల వారందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు (IRDAI Removes Age Limits On Health Insurance) పూర్తి వివరాలు పరిశీలిద్దాం .
IRDAI Removes Age Limits On Health Insurance :
- 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు IRDA శుభవార్త తెలిపింది.
- ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఎత్తివేసింది.
- ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 1 నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు IRDA తెలిపింది.
- ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయో పరిమితి 65ఏళ్లుగా ఉండేది.
- ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చని IRDA తెలిపింది. అంటే అన్ని వయస్సుల వారికీ బీమా సంస్థలు పాలసీలు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది.
- సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు డిజైన్ చేవచ్చని IRDA తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
- ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ ఏర్పడుతుంది.
- కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను పెంచుకోవటానికి వీలు పడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి IRDA మరికొన్ని మార్పులు కూడా చేపట్టింది.
- ముందస్తు వ్యాధుల వెయిటింగ్, మారటోరియం పీరియడ్లను బాగా తగ్గించింది. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను ఇప్పుడు మూడేళ్లకు కుదించింది.
- దీనివల్ల మూడేళ్లు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే, ముందస్తు వ్యాధులను కారణంగా చూపి బీమా సంస్థలు క్లెయిమ్‌లను తిరస్కరించడానికి వీలుండదు. మారటోరియం వ్యవధిని కూడా 8 నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.
Bombay high court సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకు ?
IRDA :
Insurance Regulatory and Development Authority
|
Average Rating