How to Apply for New Ujjwala Connection

0 0
Read Time:3 Minute, 51 Second

Pradhan Mantri Ujjwala Yojana

  • మీకు రేషన్​ కార్డు ఉందా ?  రేషన్​ లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్​ సిలిండర్​, స్టవ్​ పొందవచ్చు. అది ఎలా పొందాలి ? How to Apply for New Ujjwala Connection  ?
  • ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 స్కీమ్‌ కింద రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు గ్యాస్ స్టవ్‌ను కేంద్రం ఫ్రీగా ఇస్తోంది.
  • మరి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..?
  • ఆన్‌లైన్​లో ఎలా అప్లై చేసుకోవాలి..?
  • ఏయే డాక్యుమెంట్స్ కావాలి..?
  • దేశంలోని పేద మహిళల కోసం ప్రారంభించిన స్కీమ్.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్​ కింద గ్యాస్ లబ్ధిదారులకు ఏటా 2 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు.
  • లక్షలాది కుటుంబాలకు వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశంతో 2016 మే1న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులకు ఈ స్కీం వర్తిస్తుంది.

అర్హతలు ఏంటి:

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
  • వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
  • ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్​ కనెక్షన్​ ఉండకూడదు.

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • కుటుంబ సభ్యుల ఆధార్​ కార్డులు
  • రేషన్ కార్డు
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • మొబైల్ నంబర్
  • బ్యాంక్ అకౌంట్

అప్లై చేసుకునే విధానము ఏమిటి ?

  • ముందుగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్​సైట్​ www.pmuy.gov.in/ కి లాగిన్​ అవ్వాలి.
  • హోం ​పేజీలో Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్​ చేయాలి.
  • తర్వాత స్క్రీన్​ మీద కనిపించే Click Here to apply for New Ujjwala 2.0 Connection పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి.
  • మొబైల్ నంబర్, ఓటీపీ సహాయంతో అప్లికేషన్​ను పూర్తి చేయాలి.
  • అప్లికేషన్​ ఫిల్​ చేసే సమయంలో పేరు, అడ్రస్​, ఫోన్​ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నంబర్‌ను కరెక్ట్​గా ఎంటర్​ చేయాలి.
  • దరఖాస్తును సబ్మిట్ చేసి.. ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • సంబంధిత డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉంటే వెరిఫికేషన్ తర్వాత కొత్త కనెక్షన్ లభిస్తుంది.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం తెలియకపోతే.. ఆథరైజ్డ్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ అవుట్‌లెట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సదరు డిస్ట్రిబ్యూటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి దరఖాస్తు పంపిస్తే.. అక్కడ ఆమోదం లభిస్తే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ లభిస్తుంది.

ఈ ఉజ్వల పథకం కింద మొదటిసారి స్టవ్, తొలి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది. తర్వాత నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ వస్తుంది. ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఉంటుంది.

 

Indian History స్మార్ట్  నోట్స్

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!