Read Time:5 Minute, 0 Second
No Back to Paper Ballot : సుప్రీం కోర్టు
- మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని (No Back to Paper Ballot) సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- ఈవీఎంలపై సందేహాలు లేవు అన్ని సందేహాలనూ ఈసీ నివృత్తి చేసింది , అనుమానాలపై ఆదేశాలు జారీ చేయలేం ,ఎన్నికల ప్రక్రియను మేము నియంత్రించలేం ,మళ్లీ బ్యాలట్ పద్ధతికి వెళ్లే ప్రసక్తి లేదు: సుప్రీం కోర్టు తెలిపింది.
- ఈవీఎంలపై అన్ని సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసినందువల్ల మళ్లీ బ్యాలట్ పేపర్ పద్దతికి తిరిగి వెళ్లే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- ఈవీఎంలలో పోలైన ఓట్లతో.. వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తహాడ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
- సుప్రీంకోర్టు ఎన్నికలను నియంత్రించలేదని.. ఒక రాజ్యాంగ సంస్థ (ఎన్నికల సంఘం)పై పెత్తనం చలాయించే అథారిటీగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది.
- ఈవీఎంల పనితీరుపై ఐదు ప్రధాన ప్రశ్నలకు ఎన్నికల కమిషన్ నుంచి వివరణలను రాబట్టి.. ఇరువర్గాల వాదోపవాదాలనూ విన్న అనంతరం కోర్టు ఈ అభిప్రాయానికి వచ్చింది.
- కేవలం అనుమానం ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమని.. హ్యాకింగ్ జరిగిన ఉదంతాలు లేవని పిటిషనర్ ఉటంకించిన నివేదికే స్పష్టం చేసిందని వ్యాఖ్యానించింది. 5 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఏంలతో పోల్చి చూడాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది.
- ఇంకా ఏదైనా దుర్వినియోగం జరిగినట్లు ఏ అభ్యర్థి అయినా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దామని తెలిపింది. ఈవీఎంల వ్యవస్థనే పటిష్ఠం చేసేందుకు ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంటూ తీర్పును వాయిదా వేసింది.
ఏ సాఫ్ట్‌వేరూ ఉండదు
- ఈవీఎంలలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి.
- ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఒక కేబుల్ ఉంటుంది.
- ఈ రెండూ వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రానికి అనుసంధానమై ఉంటాయి.
- మనం వేసిన గుర్తుకే ఓటు పడిందీ లేనిదీ ఈ వీవీప్యాట్ యంత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
- తమకున్న సందేహాలను ధర్మాసనం ఈసీ ముందు పెట్టింది. వాటిలోని మైక్రో కంట్రోలర్ల గురించి వివరణ కోరింది.
- వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయగలమా ? లేక రీ-ప్రోగ్రామింగ్ చేసే వీలుందా ? అని ప్రశ్నించింది. దీనికి ఈసీ.. మూడు యూనిట్లలోనూ వేర్వేరు మైక్రో కంట్రోలర్లు ఉంటాయని, వాటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేసే వీలుంటుందని కోర్టుకు తెలిపింది. కానీ, ఆ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తోసిపుచ్చారు.
- ఈవీఎంల మైక్రో కంట్రోల్ యూనిట్‌ల ఫ్లాష్ మెమొరీలను మళ్లీ ప్రోగ్రామింగ్ చేయవచ్చని వాదించారు.
- అయితే, ఆయన అభిప్రాయంతో కోర్టు ఏకీభవించలేదు.
- వీవీపాట్‌లలోని ఫ్లాష్ మెమొరీలో ఏ సాఫ్ట్‌వేరూ ఉండదని, కేవలం 1024 వరకూ ఎన్నికల గుర్తులనే లోడ్ చేయగలరని, దాని మెమొరీయే తక్కువ స్థాయిలో ఉంటుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను గుర్తుచేసింది.
- ఈసీ ఇచ్చిన సాంకేతిక నివేదికను విశ్వసించాలని స్పష్టం చేసింది. ‘‘మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచిస్తే దానికి మేమేం చేయలేం. మీ ఆలోచనా ధోరణిని మేం మార్చలేం’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Average Rating