Read Time:9 Minute, 6 Second
Donkey Milk vs Cow Milk
“ఏం చేస్తున్నావ్…. గాడిదల్ని కాస్తున్నావా….”
- “చదువుకోకపోతే గాడిదలు కాచుకోవడానికి కూడా పనికిరావు” అంటూ పిల్లల్నిపెద్దలు హెచ్చరించడం విన్నాం. కానీ ఆ గాడిదల్ని పెంచుతూ లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చని నిరూపిస్తున్నారు.
- దేశవ్యాప్తంగానూ గాడిదల పెంపకానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కారణం.. గాడిద పాలల్లో లభించే పోషకాలు. గేదె, ఆవు పాలతో పోలిస్తే ఈ పాలులో పోషకాలు అధికంగా ఉండటంతో వీటిని తాగేవారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది.
- అందుకే చాలా మంది గాడిదల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో ఆర్జిస్తున్నారు.
లీటర్ రూ.5,000-7,000:
- ఇక గాడిద పాలు ఒక లీటర్ ధర రూ.5వేల నుంచి7 వేల వరకు ఉన్నట్లు సమాచారం.
- పాలు తాజాగా ఉండడం కోసం వాటిని ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు.
- అలాగే పాలను పొడిగానూ మార్చి , ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తారు.
ఇవీ లాభాలు :
- ఇక గాడిద పాల లాభాలు చూస్తే.. ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమాకీ గాడిదపాలను ఔషధంగా వాడుతుంటారు.
- ఈ పాలల్లో ఎ, బి, బి1, బి12, సి, డి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
- నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్, స్కేబిస్, దురద, తామర… వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతారు.
- ఆ పాలతో ఫెయిర్‌నెస్ క్రీమ్, షాంపూ, లిప్‌బామ్, బాడీవాష్… వంటి కాస్మెటిక్స్ తయారుచేస్తుంటారు.
ఆవు పాల వినియోగం
- భారతదేశంలో ఆవు పాల వినియోగం పురాతన కాలం నాటిది, హిందూ మతంలో ఆవు పవిత్ర హోదాను కలిగి ఉంది.
- సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ప్రకారం ఆవు పాలను హిందూ సంస్కృతిలో గౌరవిస్తారు మరియు మతపరమైన ఆచారాలు మరియు వేడుకలలో ఉపయోగిస్తారు.
- భారతదేశం పాడి పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని సాధించింది, పాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఆపరేషన్ ఫ్లడ్ మరియు పాడి సహకార సంఘాల స్థాపన వంటి కార్యక్రమాలతో. నేడు, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది అంటే ఆవులు , గేదె లు కారణం అని చెప్పవచ్చు.
- భారతదేశంలో ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలు చారిత్రాత్మకంగా చెప్పుకోదగ్గ స్థాయి లేదు అని చెప్పాల్సిందే .
- ఇది ఆవు పాలతో సమానమైన సాంస్కృతిక లేదా మతపరమైన ప్రాముఖ్యతను అసలు కలిగి లేదు.
- ఇటీవలి సంవత్సరాలలో, గాడిద పాలు దాని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం పెరుగుతున్న ఆసక్తిని కలిగి ఉంది.
- ఇది కొన్ని ప్రాంతాలలో చిన్న-స్థాయి ఉత్పత్తి మరియు వినియోగానికి దారితీసింది.
గాడిద పాలతో మరెన్నో లాభాలు :
- 2019లో “డెర్మటాలజీ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్” అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. గాడిద పాలలో చర్మానికి ప్రయోజనకరంగా ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని వెల్లడైంది.
- గాడిద పాలలో ఉండే పోషకాలు చర్మ కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో సహాయపడడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
- అందుకే.. గాడిద పాలను సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు, షాంపూల తయారీలో వాడుతున్నారన్నారు.
- ఈ పాలతో స్నానం చేయడం వల్ల మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
- గాడిద పాలలో తల్లి పాలు, ఆవు పాలతో సమానమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే ఈ పాలు శిశువులకు పట్టించడం మంచివంటుంటారని నిపుణులు చెబుతున్నారు.
- ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, ఆర్థరైటిస్, వైరల్ జ్వరాలు, ఆస్తమా, గాయాలు నయం చేసేందుకు గాడిదపాలను మందుగా వాడుతుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
- ముఖ్యంగా ఈ పాలలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు సోకకుండా కాపాడతాయంటున్నారు.
- ముఖ్యంగా గాడిద పాలు.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయని నిపుణులంటున్నారు.
- అంతేకాదు.. ఇందులోని పోషకాలు రక్తపోటు తగ్గించడంలో ఉపయోగపడతాయట.
- అలాగే ఈ పాలలో ఉండే లాక్టోస్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Today Top 10 Current Affairs for Exams : CA April 24 2024
Average Rating