Read Time:6 Minute, 39 Second
Why Venkateswara Is Worshipped On Saturday ?
- మన పురాణాల్లో, శాస్త్రాల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిదో వివరించారు.
- శాస్త్రప్రకారం ఆదివారం సూర్య ఆరాధనకు శ్రేష్టమైనది. అలాగే సోమవారం శివునికి ప్రత్యేకమైనది.
- మంగళవారం సుబ్రమణ్య స్వామిని, ఆంజనేయుని విశేషంగా పూజిస్తూ ఉంటారు.
- అలాగే బుధవారం గణపతి పూజకు, అయ్యప్ప స్వామి
- పూజకు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఆరాధనకు శ్రేష్ఠమైనది.
- గురువారం సాయిబాబా, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకమైనది.
- శుక్రవారం శ్రీలక్ష్మీ దేవిని, దుర్గాదేవిని పూజిస్తారు.
- శనివారం మాత్రం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. (Why Venkateswara Is Worshipped On Saturday ?)
అలాగే శనిదేవుని పూజ కూడా శనివారం విశేషంగా చేస్తారు.
వెంకన్నకు శనివారమంటేనే ఎందుకంత ప్రీతి ?
- మన పురాణాల్లో చెప్పిన ప్రకారం ఎవరైతే శనివారం రోజు వేంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని బాధలుండవని సాక్షాత్తు శని దేవుడు శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడంట!
- అందుకే జాతకం ప్రకారం ఎవరైనా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు లేదా గ్రహ సంచారం ప్రకారం శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమ నిష్టలతో శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి తప్పకుండా ఉపశమనం ఉంటుంది.
- కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా దర్శించిన రోజు శనివారమే! అందుకే శ్రీనివాసునికి శనివారమంటే ప్రీతి!
- సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు శనివారమే! అందుకే శ్రీనివాసుని పూజకు శనివారం విశేషమైనది.
- శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే!
- స్వామి తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది శనివారమే!
- శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే!
- స్వామిఎంతో ఇష్టమైన చక్రత్తాళ్వార్ అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే!
- ఇన్ని ప్రత్యేకతలున్న శనివారం అంటే ఏడుకొండలవాడికి అందుకే పరమ ప్రీతి
వాడవాడలా పూజలు
- కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు.
- అందుకే ఈ రోజు నాడు శ్రీనివాసుని భక్తులు ఉపవాసాలు, పూజలు దేవాలయ సందర్శనలు చేస్తూ ఉంటారు.
- ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శనివారం వెంకన్న ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి.
- తిరుమల ఆలయంలో కూడా శనివారం నాడు విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది.
శనివారం వెంకన్న పూజ ఇందుకే!
- మామూలు రోజుల కంటే శనివారం శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని, పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతామని, అప్పుల బాధలు, అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని వెంకన్న భక్తుల విశ్వాసం.
- కలియుగంలో ‘వేం’ అంటే పాపాలు ‘కట’ అంటే నశింపజేసే వాడు అని అర్థం.
- అందుకే శ్రీనివాసుని వేంకటేశ్వరుడు అని భక్తితో పిలుచుకుంటాం. పాపాలు పోగొట్టమని ప్రార్థిస్తాం.
శ్రీవారి సేవలు
తిరుమలలో వేంకటేశ్వరునికి సంబంధించిన కొన్ని సాధారణ ఆరాధనలు మరియు ఆచారాల జాబితా ఇక్కడ ఉంది:
- సుప్రభాతం: ఆలయంలో రోజు సుప్రభాతంతో ప్రారంభమవుతుంది, ఇది వేంకటేశ్వర స్వామిని ప్రార్థనలు మరియు శ్లోకాలతో మేల్కొలిపే ఆచారం.
- అభిషేకం: ఇది పాలు, తేనె, నీరు మొదలైన వివిధ పవిత్రమైన పదార్థాలతో దేవత యొక్క ఆచార స్నానం.
- సహస్రనామ అర్చన: వేంకటేశ్వరుని వేయి నామాలను పఠించడం పూజా విధానం.
- కల్యాణోత్సవం: వేంకటేశ్వరుడు తన భార్య అయిన పద్మావతి దేవితో కల్యాణోత్సవం.
- తోమాల సేవ: స్తోత్రాలు మరియు ప్రార్థనలతో పాటు దేవుడికి పూల మాలలు సమర్పించడం.
- అర్చన: దేవత యొక్క వివిధ నామాలు మరియు లక్షణాలను పఠించడం ద్వారా ప్రార్థనలు చేయడం.
- వస్త్రాలంకరణ సేవ: దేవతను వివిధ వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరించడం.
- సర్వదర్శనం: భక్తులను రోజంతా భగవంతుని దర్శనానికి (దర్శనం) అనుమతించడం.
- నైవేద్యం: ఆరాధనలో భాగంగా దేవతకు ఆహారాన్ని సమర్పించడం.
- ఏకాంత సేవ: పగటిపూట జరిగే ఆఖరి ఆచారం, ఇక్కడ దేవతను ప్రార్థనలతో రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు.
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో వేంకటేశ్వరుని గౌరవం మరియు ఆశీర్వాదం కోసం నిర్వహించే అనేక రకాల పూజలు మరియు ఆచారాలలో ఇవి కొన్ని మాత్రమే. ప్రతి ఆచారానికి దాని ప్రాముఖ్యత ఉంది మరియు ఆలయ పూజారులు మరియు భక్తులు అత్యంత భక్తితో నిర్వహిస్తారు.
‘గోవిందా!’ అని పిలిస్తే ఆపద్బాంధవుడిలా ఆదుకునే వెంకన్నకు శతకోటి వందనాలు!
ఏడుకొండలవాడా!
వెంకటరమణా!
గోవిందా!
గోవిందా!
చరిత్ర పూర్వ యుగం యొక్క దశలు (Phases of Pre-historic Age)
Average Rating