Alejandra Marisa Rodriguez 60 ఏళ్ల Miss Universe Buenos Aires

0 0
Read Time:3 Minute, 59 Second

Alejandra Marisa Rodriguez

  • అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ అర్జెంటీనా (Argentina)కు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌ (Alejandra Marisa Rodriguez) సరికొత్త చరిత్ర సృష్టించారు.
  • ఆరు పదుల వయసులో  ఈ ‘భామ’.. తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు.
  • అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి.
  • ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ (Miss Universe Buenos Aires)’ టైటిల్‌ గెలుచుకున్నారు.
  • అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
  • వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా.. సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు.
  • ఈ ఏడాది మే నెలలో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
  • అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే ‘విశ్వసుందరి 2024’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు.
  • ఈ అందాల రాణి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
  • అభ్యర్థులకు వయోపరిమితిని తొలగిస్తూ ‘మిస్‌ యూనివర్స్‌’ ఆర్గనైజేషన్‌ గతేడాది నిర్ణయం తీసుకుంది.
  • గతంలో ఈ అందాల పోటీలో 18-28 ఏళ్ల వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది.
  • ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్‌ రిపబ్లికన్‌కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్‌ ఆ దేశ అందాల కిరీటం గెల్చుకున్నారు.
  • ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

అర్జెంటీనా

  • ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో అతిపెద్ద దేశమైన అర్జెంటీనా, అండీస్ నుండి పంపాస్ వరకు విభిన్న ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది.
  • దీని రాజధాని, బ్యూనస్ ఎయిర్స్, టాంగోకు ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక కేంద్రం.
  • అర్జెంటీనా గొడ్డు మాంసం మరియు వైన్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది,
  • ఇది దాని గొప్ప గ్యాస్ట్రోనమీని ప్రతిబింబిస్తుంది.
  • దేశం 1816లో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది మరియు పెరోన్ శకంతో సహా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంది.
  • డియెగో మారడోనా మరియు లియోనెల్ మెస్సీ వంటి చిహ్నాలను కలిగి ఉన్న ఫుట్‌బాల్ జాతీయ అభిరుచి. గుర్తించదగిన మైలురాళ్లలో ఇగ్వాజు జలపాతం మరియు పెరిటో మోరెనో గ్లేసియర్ ఉన్నాయి.
  • అర్జెంటీనా మెర్కోసూర్‌లో ప్రముఖ సభ్యుడు మరియు వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవల ద్వారా నడిచే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!