Rashtrakuta Empire రాష్ట్రకూటులు(క్రీ.శ.752-997)

0 0
Read Time:9 Minute, 23 Second

రాష్ట్రకూటులు(క్రీ.శ.752-997)

  • బాదామి చాళుక్యుల సామంతులుగా ఉంటు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.(Rashtrakuta Empire)
  • రాష్ట్రకూటులు (Rashtrakuta Empire) ఉత్తరభారతదేశానికి చెందిన ప్రతిహార, పరమార, పాల వంశీయులతోను, దక్షిణ భారతదేశానికి చెందిన పల్లవ, చోళ, వేంగి చాళుక్యులతో యుద్దాలు చేశారు.
  • మూలపురుషుడు    : ఇంద్రవర్మ
  • రాజ్యస్థాపకుడు      : దంతిదుర్గుడు
  • రాజధాని                : మాన్యఖేట,ఎల్లోరా
  • రాజచిహ్నం           : గరుడ
  • రాజభాష                : సంస్కృతం
  • గొప్పవాడు              :అమోఘవర్షుడు
  • చివరివాడు            : రెండవ కర్కరాజు
  • శిల్పకళ                 : కైలాసనాథ దేవాలయం, దశావతార గుహాలయం
  • విదేశీ యాత్రికుడు : సులేమాన్,అరబ్ యాత్రికుడు

పుట్టుక

  • దక్కన్ లో మధ్యయుగ ప్రారంభం లో సుస్థిర రాజ్యం స్థాపించిన రాజవంశం- రాష్ట్రకూటులు.
  • రాష్ట్రకూటుల (Rashtrakuta Empire) శాసనాల ప్రకారం వీరు యాదవరాజైన “సాత్యకి ” వంశస్థులుగా తెలుస్తుంది. చాళుక్యుల కాలంనాటి శాసనాలు వీరిని “కుటుంబినులు”గా పేర్కొన్నాయి.
  • కుటుంబినులు అంటే వ్యవసాయ ఆధారమైన ఒక వర్గం అని అర్ధం.

దంతిదుర్గుడు(క్రీ.శ.752-56):

  • బాదామి చాళుక్య చివరి రాజైన 2వ కీర్తివర్మను ఓడించి రాజ్యస్థాపన చేశాడు.
  • ఇతని బిరుదులు – పృధ్వీవల్లభ. ఖడ్గావలోక.
  • దంతిదుర్గుడుఎల్లోరాను  రాజధానిగా చేసుకొని పాలించాడు.
  • ఇతను పశ్చిమ చాళుక్యరాజు రెండవ విక్రమాదిత్యుని సామంతుడు.
  • పశ్చిమ చాళుక్యుల తరపున అరబ్బులను ఓడించాడు.
  • ఇతడు ఎల్లోరాలోని “దశావతార గుహాలయం” నిర్మించాడు.
  • దశావతార ఆలయ శిల్పాలన్నింటిలో అతి ప్రసిద్ధమైనది ‘ హిరణ్యకశివున్ని వధిస్తున్న నరసింహ విగ్రహం
    దంతిదుర్గుని విజయాలను వర్ణించే శాసనాలు: సమంగఢ్ శాసనం, 2) ఎల్లోరా శాసనం
  • ఇతని కుమార్తె “రేవ”ను వివాహం చేసుకున్న పల్లవరాజు- నందివర్మ.

మొదటి కృష్ణుడు (756-775):

  • ఇతని కాలంలో బాదామి చాళుక్య రాజు “రహప్ప” తన రాజ్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ మొదటి కృష్ణుడు ఓడించాడు.
  • మొదటి కృష్ణుడుకుమారుడైన 2వ గోవిందుడు విజయాదిత్యునిపైకి దండెత్తి ఓడించాడు. కావున ఈయన కాలం నుండి వేంగి చాళుక్యులతో వైరి ప్రారంభమైంది.
  • ఎల్లోరా కైలాసనాథ దేవాలయ నిర్మాణం మొదటి కృష్ణుని కాలంలో మొదలైంది.
  • ఈ దేవాలయ నిర్మాణం దాదాపు 100 సం||లు కొనసాగింది.

రెండవ గోవిందుడు(775-780):

  • గోవిందుడు-2పై తిరుగుబాటు చేసిన ఇతని తమ్ముడు-ధృవుడు.

ధృవుడు(780-794):

  • రాష్ట్రకూట రాజులలో మొదటి గొప్పవాడు..
  • ధృవుని బిరుదులు : 1. నిరుపమ, 2. కవి వల్లభ, 3. శ్రీ వల్లభ, 4. ధారవర్ష
  • ధృవుడు తన అన్న గోవిందుడు-2 కి సహకరించినందుకు తూర్పు చాళుక్యరాజు విష్ణువర్ధనుడు-4ను ఓడించారు
  • తన సామంతుడు వేములవాడ రాజైన మొదటి అరికేసరి 4వ విష్ణువర్ధనుడిని ఓడించడంలో ధృవునికి సహకరించాడు.
  • ఇతను పల్లవులపై దండెత్తి వారిని సామంతులుగా చేసుకున్నాడు.
  • ధృవుడుదక్షిణాపథమే కాక, ఉత్తరాపథంపై కూడా రాష్ట్రకూట అధికారంను ప్రతిష్టించాడు.
  • ఇతని పాలనాకాలంలో రాష్ట్రకూట రాజ్యం దక్షిణాన కావేరి నది వరకు విస్తరించింది.
  • ధృవుడు పాలవంశ రాజైన ధర్మపాలుడిని ఓడించి కనౌజ్ను ఆక్రమించాడు. ఈ విజయానికి చిహ్నంగా                  ధృవుడు రాష్ట్రకూట ధ్వజంపై “గంగా-యమునా” తోరణాన్ని చేర్చాడు.
  • శాతవాహనుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించి పాలించిన ఘనత ఇతనికే దక్కుతుంది.
  • ఇతని కాలంలో రాష్ట్రకూటుల చరిత్ర యావత్ భారతదేశ చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడు ‘అల్టేకర్’

మూడవ గోవిందుడు (క్రీ.శ.794-814):

  • ధృవుని కుమారుడైన 3వ గోవిందుడు సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే తనపై తిరుగుబాటు చేసిన తన సోదరుడైన “స్తంభుజి”ని ఓడించాడు.
  • ఇతని ఆధిపత్యాన్ని అంగీకరించిన కనౌజ్ పాలకుడు “చక్రాయుధుడు”
  • 3వ గోవిందుడు చేతిలో ఓడిపోయినవారు-1. ప్రతిహార రాజు – నాగభటుడు
    2. పాలవంశరాజు – ధర్మపాలుడు
    3. తూర్పు చాళుక్యరాజు – రెండవ విజయాదిత్యుడు.
    4. పల్లవరాజు – దంతివర్మ
  • ఇతను పల్లవ, పాండ్య, కేరళ, పశ్చిమ గాంగరాజుల కూటమిని ఓడించాడు.
  • 3వ గోవిందుడు కాలంలో రాష్ట్రకూటుల పేరుప్రతిష్టలు అత్యున్నత స్థితికి చేరుకున్నాయి.
  • ఇతని తర్వాత ఇతని కుమారుడు అమోఘవర్షుడు రాజు అయ్యాడు.

అమోఘవర్షుడు(క్రీ.శ.814-878):

  • ఇతను ఈ వంశంలోనే సుప్రసిద్ధుడు.
  • అమోఘవర్షునికి మరొక పేరు “నృపతుంగుడు”
  • చిన్నవయస్సులో అమోఘవర్షుని సంరక్షకుడు – “కర్కరాజు”.
  • ఇతను స్వయంగా కవి. ఇతనికి “కవిరాజు” అనే బిరుదు కలదు.
  • అమోఘవర్షుని సోదరిని వివాహం చేసుకున్న తూర్పు చాళుక్యరాజు – 7వ విష్ణువర్ధనుడు.
  • ఇతను నిర్మించిన రాజధాని నగరం – మాన్యఖేట (మాల్దేడ్)
  • రాజ్యంలోని కరువు కాటకాలను నిలువరించడానికి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వ్రేళ్ళను బలిగా సమర్పించినవాడు అమోఘవర్షుడు.
  • ఇతను రచించిన గ్రంథం “కవి రాజమార్గం” (కన్నడ భాషలోని తొలి అలంకార గ్రంథం)
  • అమోఘవర్షుడు ఎల్లోరాలోని 33వ గుహలో “ఖోట కైలాస ఆలయం” నిర్మించాడు.
  • అరబ్బు యాత్రికుడు సులేమాన్చే ప్రశంసలు అందుకున్న రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు
  • ఇతడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడు.

మూడవ ఇంద్రుడు:

  • అల్మసూది అనే అరబ్ యాత్రికుడు మూడవ ఇంద్రున్ని ‘మాలిక్-ఉల్-ముల్క్’ (ప్రపంచాధిపతి) అని పేర్కొన్నాడు .
  • ఇతను కనౌజ్పై దండెత్తి కనౌజ్ను నాశనం చేశాడు.

రెండవ కృష్ణుడు (క్రీ.శ.880-915)

  • ఇతని కాలంనుంచే రాష్ట్రకూట పతనం ప్రారంభమైంది.
  • రెండవ కృష్ణుడు  ప్రతిహార, కళింగ, మగధ దేశ రాజ్యాలతో ఎడతెగని యుద్దాలు చేశాడు.
  • ఇతని కాలంలో ఘూర్జర ప్రతిహార రాజైన మిహిరభోజుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ధ్వంసంచేసాడు
  • రెండవ కృష్ణుడుని ఓడించిన వేంగి చాళుక్యరాజు – గుణగ విజయాదిత్యుడు.
  • ఇతనిని ఓడించిన చోళరాజు – పరాంతక చోళుడు.

మూడవ కృష్ణుడు (క్రీ.శ.939-967)

  • ఇతను రాష్ట్రకూట ప్రతిష్ట ను పునరుద్ధరించాడు
  • తక్క్కొలమ్ యుద్ధంలో పరాంతక చోళున్ని ఓడించారు.
  • ఉజ్జయిని మహిపాలుడిని ఓడించాడు.
  • ఇతని ఆస్థానకవి – “హలాయుధుడు”
  • హలాయుధుడు “కవిరహాస్యం” అనే గ్రంథంను రచించాడు.
  • కన్నడ త్రయంలోని “పొన్నకవి ” ఇతని ఆస్థానంలోని వాడు.

కొట్టెగ(క్రీ.శ.967-973)

  • కొట్టెగను ఓడించి మాన్యఖేట నగరాన్ని ధ్వంసంచేసినది- పరమార సియకుడు .

రెండవ కర్కరాజు(క్రీ.శ.972-973)

  • ఇతను చివరి రాజు
  • రెండవ కర్కరాజుఅసమర్థత పాలన వల్ల రాజ్యంలో అల్లకల్లోలాలు ఉధృతమైనాయి. ఇతని సామంతులు స్వతంత్రులైనారు.
  • చాళుక్య రెండవ తైలపుడు రెండవ కర్మరాజును ఓడించాడు. దీంతో రాష్ట్రకూట రాజ్యం అంతరించింది.

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!