Rashtrakuta Empire పరిపాలన విధానం

0 0
Read Time:5 Minute, 57 Second

పరిపాలన  విధానం 

  • వీరి పాలనలో రాజుకు సర్వాధికారాలు కలవు.(rashtrakuta-empire-2)((Rashtrakuta Empire)
  • రాష్ట్రకూట సామ్రాజ్యంలో కొంతభాగం చక్రవర్తి ప్రత్యక్ష పాలనలో, మరికొంత భాగం సామంతరాజుల ఆధీనం లో ఉండేది.
  • సామంతరాజులు చక్రవర్తియొక్క ఆజ్ఞలను పాటించి అతనికి కప్పం చెల్లిస్తుండేవారు.
  • రాజ్యం-రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలుగా విభజించి పాలన చేశారు.
    1.   రాజ్యం-రాష్ట్రాలు
    2.  రాష్ట్రాలు- రాష్ట్రపతి / మహాసామంత / మహామండళేశ్వర
    3.  విషయము-విషయపతి/భోగపతి
    4.   గ్రామము-గ్రామాధికారి
  • ఆ విషయపతి, భోగపతి అనే అధికారులు రెవెన్యూ పాలనను “దేశగ్రామకూట” అనే రెవెన్యూ అధికారుల సహాయంతో నిర్వహించేవారు.
  • పంటలో 1/4వ వంతు పన్నుగా విధించేవారు.
  • రాష్ట్రకూటుల ఆదాయంలో అధిక భాగం సామంతరాజులు చెల్లించిన కప్పం నుండే వచ్చేది.
  • భూమిశిస్తును భాగ, కర అని పిలిచేవారు.
  • అనావృష్టి పరిస్థితులలో పన్నుల మినహాయింపు ఉండేది.

మతం

  • రాష్ట్రకూటుల కాలంలో హిందూ, బౌద్ధ,జైన మతాలు ఉన్నప్పటికి బౌద్ధం మాత్రం పతనావస్తలో ఉంది.
  • వీరి కాలంలో జైనమతం మహోన్నత స్థితిలో ఉంది.
  • ఈ కాలంలో హిందువులు శివ, విష్ణు, లక్ష్మి, సూర్యుడిని ఆరాధించేవారు.
  • దేవాలయాల్లో దేవదాసీలు దైవారాధన సమయంలో నృత్యం చేసేవారు.
  • విద్యాభ్యాసం కొరకు దేవాలయాలకు అనుబంధంగా పాఠశాలలు నిర్మించారు.
  • అగ్రహారాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా రూపొందాయి.
  • రాజ్యంలో ఉన్న ముఖ్యనగరాలు, పుణ్యక్షేత్రాలు కూడా విద్యాకేంద్రాలుగా వర్ధిల్లాయి.
  • వీరు ముస్లింలకు తమ రాజ్యంలో మసీదులు నిర్మించుకొనుటకు అనుమతులిచ్చారు.

సామాజిక-ఆర్థిక అంశాలు:

  • సమాజంలో నిమ్నకులాల పరిస్థితి మెరుగైంది.
  • సతి ఆచారం అంతగా ప్రచారంలో లేదు.
  • బాల్యవివాహాలు ఉన్నాయి. కానీ వితంతు వివాహాలు లేవు.
  • వీరి రాజ్యంలో ప్రధాన పంటలు-వరి,జొన్న, పత్తి,
  • వస్త్రపరిశ్రమ చాలా అభివృద్ధి చెందింది. గుజరాత్, బీరార్, తెలంగాణాలు ఈ పరిశ్రమకు ముఖ్య కేంద్రాలు.
  • దేశంలో తయారైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారు.
  • అరబ్బులతో వ్యాపారాన్ని ప్రోత్సహించారు.

శిల్పకళ:

  • ముంబాయి నమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు రాష్ట్రకూటుల (rashtrakuta-empire)కాలం నాటివి.
  • ఇవి ఎలిఫెంటా ద్వీపం లేదా ఘరపురి (The City of Caves)లో ఉన్నాయి.
  • వీటిని 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.
  • నల్లరాయితో చెక్కిన ఏనుగు శిల్పం ప్రస్తుతం ‘జిజమాతా ఉద్యాను (ముంబాయి) తరలించడం జరిగింది.
  • ఏలిఫెంటా గుహాలయంలోని ప్రఖ్యాత శిల్పం – త్రిమూర్తి శిల్పం
  • భారతీయ శిల్పకళారంగంలో ఎనలేని పేరుగాంచినది రాష్ట్రకూటుల యొక్క ఏకశిలా వాస్తు నిర్మాణం,
  • ఎల్లోరాలోని దశావతార గుహాలయం – 15వ గుహలో ఉన్నది. దీనిని దంతిదుర్గుడు నిర్మించాడు.
  • వీరి అత్యున్నత వాస్తుశైలికి నిదర్శనం – ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం
  • పశ్చిమ చాళుక్యుల కాలంలో మొదలైన వెసారశైలి వీరి కాలంనాటికి అత్యున్నత స్థితికి చేరుకుంది. ‘

ఎల్లోరా గుహలు:

  • ఇది ఔరంగాబాద్ (మహారాష్ట్ర)కు సమీపంలో ఉన్నాయి.
  • నిర్మించినది- రాష్ట్రకూటులు
  • ఇవి బౌద్ధ, జైన, హిందూ మతాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్నాయి.
సాహిత్యం:
  • వీరి రాజభాష – సంస్కృతం
  • వీరి కాలంలో అభివృద్ధి చెందిన భాషలు – కన్నడం
  • కన్నడ కవిత్రయం – 1 )పంప-కన్నడ ఆదికవి, 2 )పొన్న ,3 )రన్న
  • పంప : కన్నడ ఆదికవి రాష్ట్రకూటుల సామంతుడైన వేములవాడచాళుక్యూల పోషణ నుఅందుకున్నాడు.
  • ఇతని రచనలు :1. ఆదిపురాణం,2. విక్రమార్జున విజయం.
  • పొన్న:3వ కృష్ణుని ఆస్థానంలో ఉండేవాడు
  • రచనలు : శాంతిపురాణం
  • రన్న రచనలు :1. అజిత పురాణం, 2. గదాయుద్ధం.
అమోఘవర్షుని సాహిత్యం :
  • ఇతని రచనలు:
    1) కవిరాజమార్గ-కన్నడ భాషలో మొదటి అలంకార గ్రంథం,
    2) ప్రశ్నోత్తర రత్నమాళిక,
    3) నీతికావ్యం
  • ఇతని కాలంలో జైనమత కవులు: 1) గణితయానవీర ఆచార్య-గణితసార సంగ్రహ,

2) శాత్తాయన-అమోఘవృత్తి

హరిసేనుడు :
  • ఇతను అమోఘవర్షుని ఆస్థానకవి
  • ఇతని గ్రంథం – హరివంశం
  • ఇతడు ఆదిపురాణంలో కొంతభాగం రచించాడు.

 

Rashtrakuta Empire రాష్ట్రకూటులు(క్రీ.శ.752-997)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!