Indian National Army

0 0
Read Time:7 Minute, 16 Second

భారత జాతీయ సైన్యం

  • INA (Indian National Army)-రూపకర్త మరియు స్థాపకుడు కెప్టెన్ మోహన్ సింగ్
  • 1942 ఫిబ్రవరి నాటికి సింగపూర్లోని బ్రిటీష్ ప్రభుత్వం జపాన్ కు లొంగి పోయింది . ఈ సందర్భంగా కొన్నివేల మంది భారత యుద్ధ ఖైదీలు జపాన్ కు పట్టుబడ్డారు. ఈ ఖైదీలను మోహన్ సింగ్కు అప్పగించినది పూజివారా (జపాన్ సైన్యాధిపతి).
  • యుద్ధ ఖైదీలతో బ్రిటీష్కు వ్యతిరేకంగా భారత జాతీయ సేనను ఏర్పాటు చేసేలా మోహన్ సింగ్ ను జపనీయులు ఒప్పించగలిగారు.
  • 1942 ఆగస్టులో మోహన్ సింగ్ యుద్ధ ఖైదీలతో భారత జాతీయ సైన్యం (INA – Indian National Army)ఏర్పాటు చేశారు.
  • ఇదే సమయంలో జపాన్లో ప్రవాస జీవితం గడుపుతున్న రాస్ బిహారీ బోస్ టోక్యోలో భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్) స్థాపించాడు. తరువాత ఇది INAలో విలీనం అయినది.
  • రాస్ బిహారీబోస్ ఆహ్వానం మేరకు సుభాష్ చంద్రబోస్ INA బాధ్యతలు స్వీకరించాడు.
  • నోట్: రాస్ బీహారీబోన్ 1946 జనవరిలో టోక్యోలో మరణించాడు.
  • సుభాష్ చంద్రబోస్ INA ను పునర్వ్యవస్థీకరించి ఆజాద్ హిందూ ఫౌజ్ గా మార్చాడు. దీని ప్రధాన లక్ష్యం – భారత్ కు స్వాతంత్య్రం సాధించి పెట్టడం.
  • ఆజాద్ హిందు ఫౌజ్ (1943 అక్టోబర్) 2 శాఖల కలయిక – 1) INA
    2) భారత స్వాతంత్య్ర సమితి
  • ఈ ఫౌజ్ భారతీయులను సైన్యంలో చేరాలని ఉత్తేజితున్ని చేయడానికి “అజాద్ హిందు రేడియో”ని ఉపయోగించినది.
  • భారత దేశం స్వతంత్ర్యం పొందడం కోసం జపాన్ పూర్తిగా సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని టోజో (Tojp) సుభాష్ చంద్రబోస్కు హామీ ఇచ్చాడు.
  • 1943 ఆగష్టు 26న బోస్ అజాద్ హిందూ ఫౌజ్ కు నాయకత్వం వహించి, “ఛలో ఢిల్లీ” అనే నివారం ఇచ్చాడు.
  • INA ఇచ్చిన నినాదం – ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ నినాదాన్ని రూపొందించినది మౌలానా హస్రత్ మోహానీ,
  • అజాద్ హిందు ఫౌజ్లో చేరిన హైదరాబాద్ వాసి – అబిద్ హసన్ సఫ్రానీ
INAలో గల రెజిమెంట్స్:
  • 1) గాంధీ రెజిమెంట్, 2) నెహ్రూ రెజిమెంట్, 3) ఆజాద్ రెజిమెంట్,
    4) బోస్ రెజిమెంట్ – దీని సేనాపతి – షానవాజ్ఫాన్, 5) ఝాన్సీ రెజిమెంట్

 

  • ఝాన్సీ రెజిమెంట్ స్త్రీల కోసం ఏర్పాటు చేయబడింది. దీని అధ్యక్షురాలు -కెప్టెన్ లక్ష్మీసెహగల్. ఈమె గతంలో అబ్దుల్ కలాంపై రాష్ట్రపతి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసినది.
  • బోస్ రెజిమెంట్కు నాయకత్వం వహించినది- షానావాజ్ ఖాన్
  • 1943 అక్టోబర్ 21న సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో తాత్కాలిక (The Provisional govt of free India) ఏర్పాటు చేసాడు .
  • ఈ ప్రభుత్వ అధినేతగా ‘నేతాజీ’ అని పిలువబడ్డాడు.
  • సుభాష్ చంద్రబోస్ అండమాన్, నికోబార్ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీదీవులు అని, నికోబార్ దీవులకు స్వరాజ్య దీవులని పేరు పెట్టాడు.
  • జపాన్ దళాల నుండి సరియైన సహకారాలు INAకు అందకపోవడంతో 1945 మేలో బ్రిటీష్ వారు రంగూన్ను ఆక్రమించారు. ఈ ఆక్రమణతో INAసైనికులు బ్రిటీష్ వారికి యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. దీంతో భారత జాతీయ సైన్యం సాగించిన స్వాతంత్య్ర పోరాటం ముగిసింది.
ఆజాద్ హింద్ (Provisional Govt of Free India)
  • ఇది ఆక్రమిత సింగపూర్లో 1943 అక్టోబర్ 21న ఏర్పడింది.
  • దీనిని బలపరిచినది – జపాన్, నాజీ జర్మనీ
  • రాజధాని – పోర్ట్ బ్లెయిర్
  • దీని అధినేత, ప్రధాని – సుభాష్ చంద్రబోస్ (1943-45)
  • కరెన్సీ – రూపాయి.
  • ఇది చరఖాలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని జెండాను కలిగిన ప్రభుత్వం
  • ఆజాద్ హింద్ మధ్యలో ‘పులి’ గుర్తును వాడారు.
  • ఈ ప్రబుత్య గీతం – “Subh Sukh Chain”

మంత్రివర్గం

  • 1. సుభాష్చంద్రబోస్ – ప్రధాని, యుద్ధ & విదేశీ వ్యవహారాలు
  • 2. కెప్టెన్ లక్ష్మీసెహగల్ – మహిళా సమాఖ్య
  • 3) యస్.ఎ. అయ్యర్ – బ్రాడ్ కాస్టింగ్ & పబ్లిసిటీ
  • 4) ఎ.సి. చటర్జీ – ఆర్థిక మంత్రి
  • ప్రభుత్వ లీగల్ అడ్వైజర్- ఎ.యన్. సర్కార్.
  • ప్రభుత్వ సుప్రీం అడ్వైజర్- రాస్ బిహారి బోస్
  • ప్రభుత్వ సెక్రటరీ – ఎ.ఎమ్. సాహే

INA విచారణ లేదా ఎర్రకోట విచారణ (1945)

  • భారత జాతీయ సైన్యానికి చెందిన యుద్ధ ఖైదీలను బ్రిటీష్ వారు 1945 నవంబర్ 5 ఎర్రకోట వద్ద విచారణ చేశారు. దీనినే INA విచారణ లేదా ఎర్రకోట విచారణ అంటారు.
  • వీరు ఎదుర్కొన్న అపరాధం – “Waging for war against the king – Emperor”
  • ఈ విచారణలో నిందితులు -1) ప్రేమ్ సెహగల్ (హిందు)
    2) షానవాజ్ ఖాన్ (ముస్లిం)
    3) గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ (సిక్కు)
  • వీరి విడుదలను కోరిన సంస్థలు – INA , ముస్లింలీగ్, RSS, హిందూమహాసభ |
  • ఈ విచారణ సమయంలో ఆజ్మీర్లో పంపిణీ అయిన పాంప్లేట్ – “Patriots not traitors”
  • ఢిల్లీ లో కనబడిన పోస్టర్ లో రాసి వున్నా అంశం – “20 English dogs for every INA man sentenced”
  • వీరి తరుపున వాదించినది – భూలాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సహ్రూ, కట్జూ , నెహ్రూ, అరుణా అసఫ్ అలీ.
  • ఈ విచారణ నవంబర్ 5 నుండి 11 వరకు వారం రోజులపాటు జరిగింది. దీనినే INA వారం అంటారు.
  • నవంబర్ 12ను INA DAY గా పరిగణించారు.
  • 1945 డిసెంబర్ 13న యుద్ధ ఖైదీల విచారణ ముగిసింది. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.
  • అయితే ఆనాటి భారత సర్వసైన్యాధికారి ఫీల్డ్ మార్షల్ క్లాడ్ అచిన్ లేక్ బ్రిటీష్ ప్రధాని అయిన అట్లీని ఒప్పించి, శిక్షలు రద్దు చేయించారు.

 

Rashtrakuta Empire పరిపాలన విధానం
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!