AP STATE SYMBOL – 2

0 0
Read Time:8 Minute, 51 Second

AP STATE SYMBOL – 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం.

  • రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు (Jasmine). దీని శాస్త్రీయ నామం-జాస్మినమ్ అఫిసినలే. (AP STATE SYMBOL – 2)
  • ఇది పొదల ప్రజాతికి చెందిన, అలివ్ కుటుంబానికి (ఒలకేసి) చెందిన తీగలా పెరిగి సువాసనలిచ్చే పూలు పూసే మొక్క ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినమ్ సంబక్ మాత్రమే.
  • దీన్నే అరేబియన్ జాస్మిన్, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా… ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు.

రాష్ట్ర ఫలం:

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం- మామిడి పండు. దీని శాస్త్రీయ నామం మాంజీ మాఫెరా ఇండికా, ఇది భారతదేశపు జాతీయ ఫలం దీనిని “ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా”. గా పిలుస్తారు. ఫలాలలో రారాజుగా పిలుస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం

  • రాష్ట్ర నృత్యం- కూచిపూడి, కూచిపూడి అనేది నాట్య- నాటక ప్రదర్శన.
  • ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్యాలలోఇది ఒకటి.
  • ఆంధ్ర ప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో కూచిపూడి అనే గ్రామం పేరు మీద కూచిపూడి పేరు వచ్చింది.
  • కూచిపూడి అనే పేరు కుచేలపురం లేదా కుచిలపురి, కుసిలవ-పురంఅనే సంస్కృతం పేర్ల నుండి ఉద్భవించింది.
  • దీని అర్ధం నటుల గ్రామం. కుసిలవ అనేది ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కనిపించే పదం దీనికి అర్ధం “నర్తకి”.
  • కూచిపూడి నాట్య శాస్త్రం మొదటి పూర్తి ప్రాచీన సంకలనం క్రీ.పూ.200 నుంచి క్రీ.శ. 200 మధ్య కాలంలో రాయబడినది. కూచిపూడి నాట్య శాస్త్ర వచనం 36 అధ్యాయాలుగా 6000 శ్లోకాలను కలిగి ఉంది.
  • రస సిద్ధాంతం, బావ వ్యక్తీకరణ, హావభావాలు, నటనా పద్ధతులు, ప్రాథమిక దశలు, నిలబడి ఉన్న భంగిమలు- ఇవన్నీ ఇందులో వివరించబడ్డాయి.
  • అద్వైత వేదాంతానికి చెందిన సన్యాసి అయిన తీర్థ నారాయణ యతి మరియు అతని శిష్యుడు సిద్ధేంద్ర యోగి కలిసి 17వ శతాబ్దంలో కూచిపూడి యొక్క ఆధునిక సంస్కరణను రచించి, వ్యవస్థీకరించారు.
  • కూచిపూడి ఎక్కువగా వైష్ణవ (కృష్ణుడి) సంప్రదాయంగా అభివృద్ధి చెందింది, దీనిని తమిళనాడులో “భాగవత మేళా” అని పిలుస్తారు. ఇందులో వాడే వాయిద్యాలు: మృదంగం, తాళాలు, వీణ, వేణువు, తంబురా

రాష్ట్ర క్రీడ

  • రాష్ట్ర క్రీడ: కబడ్డీ (చెడుగుడు- ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ల సంఖ్య -07). ఈ ఆట 20వ శతాబ్దంలో పోటీ క్రీడగా ప్రాచుర్యం పొందింది.
  • ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మొదలైన భారత రాష్ట్రాల అధికారిక క్రీడ, కబడ్డీలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి.
  • పంజాబీ కబడ్డీ అనేది వృత్తాకార మైదానంలో ఆరుబయట ఆడతారు. దీనిని “సర్కిల్ స్టైల్” అని కూడా పిలుస్తారు.
  • “ప్రామాణిక శైలి” ఆట పైకప్పుగల క్రీడలమైదానంలో దీర్ఘచతురస్రాకార కోర్టులో ఆడతారు. ప్రధాన వృత్తిపర పోటీలు, ఆసియా క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలలో ప్రామాణిక శైలి వాడతారు.
  • భారత ఉపఖండంలోని వివిధ ప్రాంతాలలో ఈ ఆటను అనేక పేర్లతో పిలుస్తారు, అవి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కబడ్డీ: పంజాబ్ ప్రాంతంలో కౌడ్డీ లేక కబడ్డీ; పశ్చిమ భారతదేశంలో “హు- టు-టు”, తూర్పు భారతదేశంలో “హు-డో-డో”; బంగ్లాదేశ్లో లో “కబాడి” లేదా “హ-డు-డు”; మాల్దీవులలో “బావతిక్”, నేపాల్లో “కపార్టీ”.
  • కబడ్డీ మొదటిసారిగా చైనాలో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల చరం:

  • రాష్ట్ర జల చరం డాల్ఫిన్, గంగా నదిలో నివశించే డాల్ఫిన్ను 2009లో జాతీయ జలచరం గా ప్రకటించారు.డాల్ఫిన్ సముద్రపు నీటిలో, నదీ జలాల్లో నివసించే ఒక రకమైన క్షీరదము.
  • డాల్ఫిన్ జాతులలో రకాలు –
  1.  డెల్ఫినిడే – ఇవి సముద్రపు నీటిలో నివశించే డాల్ఫిన్ల
  2.  ప్లాటానిస్టిడే-ఇది భారతదేశ నదీ జలాలలో నివశించే డాల్ఫిన్లు .
  3. ఇనిడే- ఇవి కూడా నదులలో నివశించే మరొక జాతి డాల్ఫిన్లు.
  4. పొంటోపోరిడే ఉప్పునీటిలో నివశించే డాల్ఫిన్లు.
  5.  లిపోటిడే – చైనీస్ నదులలోనివశించే డాల్ఫిన్లు ఇవి అంతరించి పోయినాయి.

రాష్ట్ర అధికారిక భాష :

  • తెలుగు, తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
  • అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లోసాధ్యమైనంతవరకూ ఆ భాష నే ఉపయోగించాలి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది.(AP STATE SYMBOL – 2)
  • 1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది, ప్రస్తుత అధికారభాషా సంఘం అధ్యక్షుడు – పి. విజయ్ బాబు
  • రాజ్యాంగంలోని 17వ భాగంలో 343 నుంచి 351 వరకు గల ప్రకరణలు అధికార భాషల గురించి తెలియజేస్తున్నాయి.
  • రాష్ట్ర శాసనసభలు ఆ రాష్ట్రంలో మాట్లాడే భాషల్లో ఒక భాషను లేదా కొన్ని భాషలను లేదా హిందీని అధికార భాషగా ప్రకటించవచ్చు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం:

  • మా తెలుగు తల్లికి మల్లెపూదండ(శంకరంబాడి సుందరాచార్య) సుందరాచార్యులు ‘మా తెలుగు తల్లికి గీతాన్ని 1942 దీనబంధు సినిమా కోసం రచించాడు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం .
  • ఈ పాటలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

అధికారిక వార్తా చానెల్:

  • అధికారిక వార్తా చానెల్: సప్తగిరి. దూరదర్శన్ సప్తగిరి (తెలుగు భాషలో) తొలి టీవి ఛానల్.
  • ఇది 1977అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిచే ప్రారంభించబడింది.
  • హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. 1998 నుంచి 24గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.
  • 2003 ఏప్రిల్ 2 నుండి దీని పేరు సప్తగిరి ఛానల్గా మార్చారు.
  • 2014 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక టెలివిజన్ గా సప్తగిరి ఛానల్ ను కేంద్రప్రభుత్వం గుర్తించింది.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!