Read Time:5 Minute, 32 Second
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్
- Bombay high court సంచలన తీర్పు.. 28 వారాల గర్భవిచ్ఛితికి అనుమతి.. ఎందుకు ?(bombay-high-court-maternity-leave)
- బాల్య వివాహ బాధితురాలికి గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పునిచ్చింది.
- పిండంలో జన్యుపరమైన సమస్యలు ఉండటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది.
- మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలికకు 2022లో బాల్యవివాహం జరిగింది.
- మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం.. 24 వారాలుపైబడిన గర్భాన్ని తొలగించుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.
- అయితే పెళ్లైన కొన్నాళ్లకు గర్భం దాల్చిన బాలిక.. 28 వారాలపాటు అలాగే గడిపింది. ఈ క్రమంలో మెడికల్ చెకప్ చేసుకున్న ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది.
- ఆమె కడుపులో పెరుగుతున్న పిండానికి జన్యుపరమైన సమస్యలు ఉన్నట్లు స్కానింగ్‌లో తేలింది.
- దీంతో గర్భవిచ్ఛిత్తి కోరుతూ ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
- న్యాయమూర్తులు పీడీ నాయక్, ఎన్ఆర్ బోర్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రిల్ 12న ఆమె పిటిషన్‌పై విచారణ జరిపింది.
- కోర్టు విడుదల చేసిన ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సదరు ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది.
- బాలిక HIV సెరోపోజిటివ్‌తో బాధపడుతున్నట్లు తేలింది.
- దీంతోపాటు పిండానికి సమస్యలు ఉండటంతో బాలిక గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం.. 24 వారాలుపైబడిన గర్భాన్ని తొలగించుకోవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి.
- బాలిక మైనర్ కావడం, “HIV సెరోపోజిటివ్ స్టేటస్”తో బాల్య వివాహ బాధితురాలు అయినందున గర్భాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ పూణేలోని సాసూన్ జనరల్ హాస్పిటల్ మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ప్రకారం హైకోర్టు విచారణ జరిగింది. బోర్డు తన నివేదికలో పిండంలో లోపాలు ఉన్నాయని వెల్లడించింది. బాలిక మానసిక, వైద్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది.
- bombay-high-court-maternity-leave
ప్రమాదకరంగా 45% అబార్షన్లు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 45% అబార్షన్లు ప్రమాదకర రీతిలో జరుగుతున్నట్లు ఓ అంచనా. సరైన సమయంలో, సురక్షిత ప్రదేశంలో, సుశిక్షితులు చేయకపోవటం వల్ల ఇవి చాలా సందర్భాల్లో మరణాలకు దారితీస్తున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో- గర్భవిచ్ఛిత్తికి సంబంధించి పలు అధ్యయనాల్లో తేలిన ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే.. .
- ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.3 కోట్ల ఉద్దేశపూర్వక అబార్షన్లు జరుగుతున్నాయి.
- 97 శాతం అబార్షన్లు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చోటుచేసుకుంటున్నాయి.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గర్భవిచ్ఛిత్తి తర్వాత తలెత్తే సమస్యలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఏటా 70 లక్షలకుపైగా ఉంటోంది.
- అబార్షన్లకు అనుమతి అన్ని దేశాల్లో ఒకేలా లేదు. ప్రపంచంలో 42 దేశాలు… గర్భిణి ప్రాణం రక్షించే క్రమంలో అబార్షన్‌కు అనుమతిస్తున్నాయి.
- మరో 50 దేశాలు ఆరోగ్య కారణాలతో గర్భవిచ్ఛిత్తికి అంగీకరిస్తున్నాయి.
- మహిళల ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా బేరీజు వేసి… పుట్టిన పిల్లలను తల్లి సాకలేరని నిర్ధారణకు వస్తే అబార్షన్‌కు అనుమతించే దేశాలు 13.
- 75 దేశాలు విజ్ఞప్తి చేసినంతనే అబార్షన్‌కు ఓకే చెప్పేస్తున్నాయి.
- 24 దేశాలు మాత్రం అబార్షన్‌ను పూర్తిగా నిషేధించాయి. అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తమ దేశంలో అబార్షన్‌లు హక్కు కాదని తీర్పునిచ్చింది. ఎల్‌సాల్వడార్‌లాంటి చోట్ల గర్భస్రావం చేయించిన మహిళలను జైల్లో పెట్టి శిక్షిస్తున్నారు.
Average Rating