CLIMATE OF ANDRA PRADESH – 2

0 0
Read Time:6 Minute, 26 Second

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి(CLIMATE OF ANDRA PRADESH )

 వేసవికాలం: (CLIMATE OF ANDRA PRADESH – 2)

  • సూర్యుడు మార్చి 21 తర్వాత భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళంపైకి ప్రయాణించడం వలన లేదా ఉత్తర దిశలో ప్రయాణించటం వలన ఉత్తరార్ధగోళం లేదా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
  • ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలాన్ని వేసవి కాలంగా పేర్కొంటారు.
  • ఆంధ్రప్రదేశ్లో వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత ‘మే’లో నమోదు అవుతుంది.
  • వేసవిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 45°Cనుంచి 47°C వరకు ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు20°C నుంచి 22°C వరకు ఉంటాయి.
  • వేసవిలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 31.5°C అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 18°C ఉంటుంది.
  • రాష్ట్ర సరాసరి ఉ ష్ణోగ్రత 27°C. తీరప్రాంతంలో 40°Cనుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు ఉండి వాతావరణంలో అర్ద్రత పెరిగి చాలా ఉక్కపోతగా ఉంటుంది.
  • దీని వలన మద్యాహ్న సమయాలలో వడదెబ్బ తగాలతనికి అవకాశాలు అధికంగా ఉంటాయి.
  • ఈ సమయంలో గుంటూరు జిల్లాలోని రెంటచింతల, విజయవాడ, కడప ప్రాంతాలలో 46 °C పైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
  • మైసూరు పీఠభూమికి అనుకొని ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఇతర ప్రాంతాల కంటే మరింత చల్లగా ఉంటాయి.
  • చిత్తూరు జిల్లాలోని “హార్సిలీ హిల్స్ వేసవి విడిది కేంద్రం”చల్లగా ఉంటుంది. మే నెల రెండు, మూడు వారాల్లో రాష్ట్రమంతటా వడగాలులు వీస్తాయి.
  • పీఠభూమి ప్రాంతాలైన రాయలసీమ ప్రాంతం లో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగాను, రాత్రిపూట తక్కువగాను ఉంటాయి.
  • పీఠభూమి తో పోలిస్తే తీరప్రాంతం లో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగాను, రాత్రిపూట ఎక్కువగాను ఉంటాయి.
  • పీఠభూమి ప్రాంతం లో దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అధికంగా ఉంటాయి.
  • తీరప్రాంతంలో దినసరి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి.
  • ఆంధ్రప్రదేశ్లో తీరప్రాంతంలో స్థిరమైన ఉష్ణోగ్రతలు, పీఠభూమి ప్రాంతంలో అస్థిరమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.(CLIMATE OF ANDRA PRADESH – 2)
  • అలాగే బంగాళాఖాతం లో తుఫానులు ఏర్పడటం వల్ల అప్పుడప్పుడు తీరప్రాంతాలలో వర్షం కురుస్తుంది ఉదా: 1969, 1990, 2004, సంవత్సరాలలో మే నెలలో అధిక వర్షపాతం నమోదయ్యింది.
  • ఈ రుతువులో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉ రుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన సంవహన వర్షపు జల్లులు పడతాయి.
  • వేసవిలో రాష్ట్రంలో ఋతుపవనాలు రాకముందు పడే జల్లులను మామిడి జల్లులు లేదా మ్యాంగోషవర్స్ లేదా ఏరువాక జల్లులు అని పిలుస్తారు.
  • విశాఖపట్నం, మచిలిపట్నం, కాకినాడ, ప్రాంతాల్లో సముద్రం ప్రభావం వల్ల తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి.

 నైరుతి రుతుపవనకాలం/ వర్షాకాలం

  • మాన్ సూన్ అనే పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది.
  • మే నెల అంతంనాటికి ఉత్తరభారతదేశం టిబెట్ లలో ఏర్పడిన అల్పపీడనం అత్యంత శక్తి వంతంగా మారుతుంది.
  • దీని కారణంగా భూమధ్య రేఖ వద్ద ఉన్న వ్యాపార పవనాలు భారతదేశం వైపు పయనిస్తాయి.
  • ఇవి కొరియోలసిస్ ఫోర్స్ కారణంగా ఫెరల్ సూత్రం ప్రకారం కుడివైపు వంగి పయనించి భారతదేశానికి నైరుతి దిశలో చేరుకుంటాయి.(CLIMATE OF ANDRA PRADESH – 2)
  • అందువల్లనే వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. నైరుతి ఋతుపవనాలు ఏర్పడడంలో ఇంటర్
    ట్రాఫికల్ కన్వర్జెంట్ జోన్ (అంతర ఆయనరేఖ అభిసరణమండలం) (ITCZ)యొక్క పాత్ర క్రింది విధంగా ఉంటుంది.
  • ఈశాన్య, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలిసే ప్రాంతంను ICTZ అని పిలుస్తారు.
  • ఇది సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అనగా ఇది భూమధ్యరేఖ ప్రాంతం నుండి ఉత్తర కర్కటక రేఖ 23 1 /2° వరకు విస్తరించి ఉంటుంది. దీన్ని ఋతుపవన ద్రోణి (Monsoon Trough) అంటారు.
  • జూన్ జూలైనెలలలో ట్రోపో ఆవరణంలో ఉండే వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ (Westerly Jet Streams) ఉత్తర భారతదేశంలో అల్పపీడన ద్రోణిని ఏర్పరుస్తుంది.
  • దీంతో భూమధ్యరేఖ వద్ద ఉన్న పవనాలు ఉత్తర భారతదేశంలోకి పయనిస్తాయి.
  • ఈ పవనాలు హిందూ మహా సముద్రం ,అరేబియా సముద్రం ,బంగాళాఖాతం ల నుంచి తేమను సేకరించి భారత దేశానికీ ఇస్తాయి . ఈ వర్షాలనే నైరుతి రుతు పవనాలు అంటారు .
  • నైరుతి రుతు పవనాలు ఆరంభంలో సముద్ర ప్రభావిత గాలుట ప్రసరనలో చిక్కుకుపోవడం పల్ల ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు ప్రారంభమవడాన్ని ఋతుపవన ఆరంభం వర్షాలు అంటారు.
  • నైరుతి రుతు పవనాలు భారత దేశం వైపు పయనిస్తూ 2 శాఖలుగా చీలి పోతాయి . అవి అరేబియా శాఖ, బంగాళాఖాతం శాఖ.ఇందులో అరేబియా శాఖవల్లనే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఋతుపవనాలు విస్తాయి.

 

CLIMATE OF ANDRA PRADESH – 1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a comment

error: Content is protected !!