Read Time:9 Minute, 28 Second
Drumstick Tree Leaves Health Benefits
- ప్రకృతిలోని ప్రతి చెట్టు ఓ ప్రత్యేక లాభాలను కలిగి ఉంటుంది.ఆయుర్వేదం, వృక్షశాస్త్రం ప్రకారం ప్రతి మొక్కలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందులో ఓ అద్భుతమైన మొక్క మునగ (Drumstick Tree ).
- మునగ చెట్టులో (Drumstick Tree) ఒకటి కాదు, కొన్ని వందల రకాల ఔషధ గుణాలుంటాయట.
- మునగ ఆకులు, కాయలు, బెరడు, పూలు, రసం, వేర్లు ఇలా ప్రతీది ఔషధాల తయారీలో ఉపయోగపడి, అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందట.
- ఎన్నో రకాల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను నయం చేయగల శక్తి మునగ చెట్టుకు ఉందట.
- ఇవే కాకుండా మునగకాయలతో కూర, సాంబార్, మునగాకుతో కారంపొడి, మునగ రసంతో రొట్టెలు, ఇలా చాలా రకాలుగా మనం వాడే మునగ చెట్టు చేసే ఆ అద్భుతాలు ఎన్నో .
ప్రయోజనాలను సంక్షిప్తీకరించే పట్టిక
ఆరోగ్య ప్రయోజనాలు | సంబంధిత వ్యాధులు/పరిస్థితులు |
---|---|
Nutrient-rich | పోషకాహార లోపం, విటమిన్ లోపాలు |
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు | ఆక్సీకరణ ఒత్తిడి-సంబంధిత వ్యాధులు (ఉదా. క్యాన్సర్, గుండె జబ్బులు) |
రోగ నిరోధక ప్రభావాలు | ఆర్థరైటిస్, ఉబ్బసం, తాపజనక ప్రేగు వ్యాధి |
జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది | మలబద్ధకం, విరేచనాలు, జీర్ణ రుగ్మతలు |
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. | అంటువ్యాధులు (బాక్టీరియల్, వైరల్), ఆటో ఇమ్యూన్ వ్యాధులు |
బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. | డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత |
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. | అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండెజబ్బులు |
చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది | చర్మ రుగ్మతలు (ఉదా. మొటిమలు, తామర), జుట్టు రాలడం |
మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క గొప్ప మూలం | ప్రోటీన్ లోపం, కండరాల వృధా |
పాలివ్వడాన్ని ప్రోత్సహిస్తుంది | పాలిచ్చే తల్లులలో తక్కువ పాల సరఫరా |
మునగ చెట్టు యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలు నిర్దిష్ట వ్యాధులు లేదా ఆరోగ్య పరిస్థితులతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఈ పట్టిక వివరిస్తుంది, ఆరోగ్యం యొక్క వివిధ అంశాలలో దాని సంభావ్య చికిత్సా ప్రభావాలను హైలైట్ చేస్తుంది.
చర్మ సంరక్షణకు :
- యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మునగ ఆకులు నిస్తేజమైన చర్మానికి తిరిగి తేజస్సు ఇవ్వగలవు.
- చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా తయారుచేయడంతో పాటు ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయట.
- మునగ ఆకు పేస్టు రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
కురుల ఎదుగుదలకు :
- మునగ ఆకు రసం జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా సహాయపడుతుందట.
- దీన్ని తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు ఒత్తుగా మారుతుందట.
- జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారేందుకు మునగాకు రసం బాగా పనిచేస్తుందట.
యాంటీ ఇన్ఫ్లమేటరీలతో:
- మునగ ఆకులో ఐసోథియోసైనేట్‌లు ఉంటాయి.
- ఇవి శరీరంలో పలు చోట్ల వచ్చే వాపు, నొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తాయి.
- అలాగే దీంట్లోని విటమిన్-సి, జీటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్‌ఫెరోల్ వంటి ముఖ్యమైన పోషకాలు నిండిన రోగనిరోధక శక్తిని బలపరిచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ:
- కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మునగ మంచి ఔషధంగా చెప్పవచ్చు.
- మునగ ఆకులు శరీరంలోని కొవ్వు తగ్గించడంలో గణనీయపాత్ర పోషిస్తాయని ఆయుర్వేదంలో నిరూపితమైంది.
- మునగాకుతో పప్పు, లేదా మునగాకు కారంపోడి తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
- ధమని గోడలలో ఫలకం ఏర్పడటాన్ని మునగాకు నిరోధిస్తుంది.
బరువు విషయానికొస్తే:
- రోజూవారీ ఆహారంలో మునగను చేర్చుకోవడం పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
- మునగాకుతో టీ, మునగాకు పొడి, మునగాకు టమాట, మునగాకు పప్పు ఇలా ఏదో రకంగా మునగను తినడం వల్ల మీ శరీర బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది.
కాలేయానికి కాపలా:
- మునగాకు పేస్టు, మునగాకు పొడి యాంటీ ట్యూబర్ క్యులర్ డ్రగ్స్ కారణంగా వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి.
- ఇవి కాలేయాన్ని ఎల్లప్పుడూ రక్షించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
- దెబ్బతిన్న కాలేయ కణాలను సరిచేయడానికి, ఆక్సీకరణ స్థాయిలను తగ్గించడానికి, ప్రోటీన్ స్థాయిలను మెరుగుపరచడానికి మునగ చెట్టు భాగాలన్నీ మీకు చక్కగా ఉపయోగపడతాయి.
Average Rating